మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Aug 12, 2020 , 14:22:02

ఇడుక్కి ఘ‌ట‌న‌లో 54కు చేరిన మర‌ణాలు‌

ఇడుక్కి ఘ‌ట‌న‌లో 54కు చేరిన మర‌ణాలు‌

తిరువ‌నంత‌పురం: కేర‌ళ రాష్ట్రం ఇడుక్కి జిల్లాలోని రాజ‌మ‌ల‌లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూ ఉన్న‌ది. ఘ‌ట‌నా ప్రాంతంలో తాజాగా మ‌రో రెండు మృత‌దేహాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో ఆ ఘ‌ట‌న‌లో చోటుచేసుకున్న మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 54కు చేరింది. ఇదిలావుంటే ఈ ప్ర‌మాదం అనంత‌రం గ‌ల్లంతైన వారిలో మ‌రో 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. 

ఈ నెల 8న ఇడుక్కి జిల్లాలోని రాజ‌మ‌ల ఏరియాలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో ప‌లువురు ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. అప్ప‌టి నుంచి అక్క‌డ ముమ్మ‌రంగా స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. శిథిలాల‌ను తొల‌గిస్తున్నా కొద్దీ మృత‌దేహాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. తాజాగా బుధ‌వారం మ‌రో రెండు మృత‌దేహాల‌ను వెలికి తీయడంతో ఆ ఘ‌ట‌న‌లో మృతిచెందిన వారి సంఖ్య 54కు చేరింది.    

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo