మంగళవారం 26 మే 2020
National - May 14, 2020 , 14:18:45

ఢిల్లీలో కొత్తగా 472 కరోనా కేసులు

ఢిల్లీలో కొత్తగా 472 కరోనా కేసులు

ఢిల్లీ: దేశ రాజధానిలో గత 24 గంటల్లో 472 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8470కి చేరింది. గడిచిన 24 గంటల్లో 187 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, ఒక్కరు కూడామృతి చెందలేదని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల ఇప్పటివరకు 115 మంది మృతిచెందారు. మొత్తంగా ఈ వైరస్‌ బారిన పడిన 3045 మంది బాధితులు కోలకున్నారు.


logo