ఆదివారం 01 నవంబర్ 2020
National - Sep 22, 2020 , 07:17:51

భీవండి ఘటనలో 17కు చేరిన మృతులు

భీవండి ఘటనలో 17కు చేరిన మృతులు

భీవండి : మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండిలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. సోమవారం తెల్లవారుజూమున మూడు అంతస్తుల భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. శిథిలాల కింద చిక్కుకుపోయిన 20 మందిని రక్షించినట్లు జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళాలు( ఎన్డీఆర్‌ఎఫ్‌) బృందాలు తెలిపాయి. భవనం శిథిలావస్థకు చేరడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ‘భీవండి ఘటన ఎంతగానో కలచివేసింది. బాధితుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి’ అని రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు. ‘భవనం కూలిపోవటం విచారకరం. తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబాలకు నా సంతాపం. క్షతగాత్రులు  త్వరగా కోలుకోవాలి. బాధితులకు అన్ని విధాలా సాయం అందిస్తాం’ అని ప్రధాని ట్వీట్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.