మంగళవారం 31 మార్చి 2020
National - Mar 13, 2020 , 16:14:31

డీఏ 4 శాతం పెంపు..

డీఏ 4 శాతం పెంపు..

హైద‌రాబాద్‌:  కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఇదో తీపి వార్త‌.  క‌ర‌వు భ‌త్యాన్ని నాలుగు శాతం పెంచిన‌ట్లు కేంద్ర క్యాబినెట్ ఇవాళ ప్ర‌క‌టించింది.  కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, పెన్ష‌న‌ర్ల‌కు ఇది వ‌ర్తిస్తుంది.  ద్ర‌వ్యోల్బ‌ణం పెరుగుద‌ల‌, త‌గ్గుద‌ల ఆధారంగా .. క‌రువు భ‌త్యాన్ని ఇవ్వ‌డం జ‌రుగుతుంది.  4 శాతం డీఏ ఇవ్వ‌డం అంటే.. కేంద్ర ప్ర‌భుత్వం ఉద్యోగుల నెల జీతం రూ.720 నుంచి ప‌ది వేల వ‌ర‌కు పెర‌గ‌నున్న‌ది. ఈ ఏడాది జ‌న‌వ‌రి ఒక‌ట‌వ తేదీ నుంచి డీఏ బాకీలు అందాల్సి ఉన్న‌ది.   ప్ర‌స్తుతం క‌నీస వేత‌నంపై ఉన్న 17 శాతానికి అధిక‌మ‌ని కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ తెలిపారు. డీఏ పెంపు వ‌ల్ల సుమారు 48 ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, 65 ల‌క్ష‌ల మంది పెన్ష‌న‌ర్ల‌కు ల‌బ్ధి జ‌ర‌గ‌నున్న‌ది. డీఏ పెంపు వ‌ల్ల కేంద్రంపై సుమారు 14వేల కోట్ల అద‌న‌పు భారం ప‌డ‌నున్న‌ది.  


logo
>>>>>>