శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 19, 2020 , 12:47:21

తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

తమిళనాడు: తిరువూరు జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పారామెడికల్‌ విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన రెండు వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


logo