శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 07:20:32

ఢిల్లీలో దవాఖానలతో హోటళ్ల లింక్‌ తొలగింపు!

ఢిల్లీలో దవాఖానలతో హోటళ్ల లింక్‌ తొలగింపు!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దవాఖానలతో హోటళ్ల అనుసంధానాన్ని (లింక్‌) తొలిగిస్తున్నట్లు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఢిల్లీలో కరోనా పరిస్థితిపై సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. 

రాజ‌ధాని ప్రాంతంలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో నగర పరిధిలో బెడ్ల లభ్యతను పెంచడానికి 40 హోటళ్లను ద‌వాఖాన‌లతో అనుసంధానిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ద‌వాఖాన‌ల్లో 12,633 బెడ్లు అందుబాటులో ఉండ‌గా, మ‌రో 4700 మంచాలు కోవిడ్ సెంట‌ర్ల‌లో ఖాళీగా ఉన్నాయి.  


logo