మోడీ అనుచరుడికి మండలి సీటు

లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విశ్వాసపాత్రుడు, ఆయన బృందంలో ఎన్నో ఏండ్లుగా పని చేసిన మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ శర్మ, ఉత్తరప్రదేశ్ శాసన మండలికి పోటీ చేయనున్నారు. ఇటీవల వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆయన బీజేపీలో గురువారం చేరారు. యూపీలోని 12 మండలి స్థానాల భర్తీకి ఈ నెల 28న జరుగనున్న ఎన్నికల్లో అరవింద్ కుమార్ శర్మ పోటీ చేయనున్నారు. ఎన్నిక అనంతరం సీఎం యోగి ప్రభుత్వంలో ఆయనకు కీలక పదవి లభిస్తుందని ప్రచారం జరుగుతున్నది.
1988 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐఎఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్ శర్మ ఉత్తరప్రదేశ్‌లోని మౌకు చెందినవారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన విశ్వసనీయ అధికారులలో ఒకరు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం అరవింద్ కుమార్ శర్మ ప్రధాని కార్యాలయంలో చేరారు. గత ఏడాది మే నెలలో ఆయనను క్లిష్టమైన ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. కరోనా లాక్డౌన్ వల్ల దెబ్బతిన్న రంగాలకు ప్రభుత్వం ప్రకటించిన సహాయక ప్యాకేజీపై కసరత్తు చేశారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా తన పనితీరు, ఫలితాల ఆధారిత విధానంతో ప్రధాని మోదీ నమ్మకాన్ని సంపాదించిన శర్మకు మండలి ఎన్నిక అనంతరం కీలక పదవి వరిస్తుందని బీజేపీ శ్రేణులు వెల్లడించాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- మహారాష్ట్రలో కొత్తగా 10,216 కరోనా కేసులు.. 53 మరణాలు
- చిరు కోసం కథలు రెడీ చేస్తున్న ఇద్దరు యంగ్ డైరెక్టర్స్
- మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులకు కొవిడ్ టీకా
- 'నాంది' రెండు వారాల కలెక్షన్లు ఎంతంటే..
- త్వరలో జియో లాప్టాప్.. చౌకగానే?!
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఏసీబీ వలలో మన్నెగూడ సర్పంచ్
- మాస్కులు లేనివారి నుండి డబ్బులు వసూలు.. నకిలీ పోలీసు అరెస్టు
- 30 రోజుల్లో 2 సినిమాలు రిలీజ్ చేయడమెలా..?