గురువారం 04 మార్చి 2021
National - Aug 30, 2020 , 14:22:10

'దావూద్‌ మా దేశ పౌరుడు కాదు'

'దావూద్‌ మా దేశ పౌరుడు కాదు'

న్యూఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది దావూద్ ఇబ్రహీం ఎప్పటికీ తమ దేశ పౌరుడు కాడని కామన్వెల్త్ ఆఫ్ డొమినికా ప్రభుత్వం తెలిపింది. ‘పెట్టుబడుల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా పౌరసత్వం పొందుతున్నట్లు ఎవరు ప్రచురించినా అది కచ్చితంగా తప్పే’ అని ఆ దేశ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘పెట్టుబడులు, పౌరసత్వ సమగ్రత కాపాడటం మా బాధ్యత. అమెరికా, యూకే దేశాల్లో అగ్రశ్రేణి, అంతర్జాతీయంగా పేర్కొందిన సంస్థలు పూర్తిస్తాయిలో తనిఖీ చేసి నివేదిక అందించిన తరువాతే పెట్టుబడుల ద్వారా పౌరసత్వం అందిస్తున్నాం’ అని తెలిపింది.

డొమినికన్‌ ప్రజల భద్రతకు నైతికత పాటిస్తామని, దేశ భద్రతతోపాటు ప్రపంచ భద్రతా తమ బాధ్యతని వెల్లడించింది.  1993లో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 250 మందికిపైగా మృతి చెందగా చాలామంది గాయపడ్డారు. ఈ దాడుల ప్రధాని సూత్రదారి దావూదే. దావూద్ ఇబ్రహీంను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను చాలాసార్లు కోరిన సంగతి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo