శుక్రవారం 03 జూలై 2020
National - Jun 15, 2020 , 01:27:30

మూలికలతో మాస్క్‌!

మూలికలతో మాస్క్‌!

పుణే: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఆధ్వర్యంలోని ‘డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ’ (డీఐఏటీ) సంస్థ పలు ఔషధ మూలికలతో బయోడీగ్రేడబుల్‌ (విచ్ఛిన్నమయ్యే) కాటన్‌ మాస్క్‌ను అభివృద్ధి చేసింది. వైరస్‌లను ఇది సమర్థంగా అడ్డుకుంటుందని ఆ సంస్థ ప్రకటించింది. వేప, పసుపు, తులసి, మిరియాలు, లవంగం, సుగంధం, కుంకుమ పువ్వు వంటి వాటిని ఉపయోగించి ఈ మాస్క్‌ను తయారుచేసినట్లు తెలిపింది. దీనికి ‘పవిత్రపతి’ అని నామకరణం చేశారు. 


logo