సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 19:23:47

జేఈఈ, ఎన్‌డీఏ పరీక్షలపై విద్యార్థుల ఆందోళన పడొద్దు : కేంద్ర మంత్రి

జేఈఈ, ఎన్‌డీఏ పరీక్షలపై విద్యార్థుల ఆందోళన పడొద్దు :  కేంద్ర మంత్రి

న్యూ ఢిల్లీ : జేఈఈ మేయిన్‌, ఎన్‌డీఏ పరీక్షల తేదీల విషయంలో విద్యార్థులు ఆందోళన చెంద వద్దని కేంద్ర మానవనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ మంగళవారం సూచించారు. జాయింట్‌ ఎగ్జామ్‌ ఎంట్రెన్స్‌ (జేఈఈ), నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) ఎంట్రెన్స్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 6న నిర్వహిస్తామని ఆయా సంస్థలు ప్రకటించడంతో రెండు పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణపై కేంద్ర మానవరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

రెండు పరీక్షల తేదీలపై విద్యార్థుల అనేక విజ్ఞప్తులు అందుకున్నామన్నారు. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.  రెండు పరీక్షల మధ్య తేదీల్లో పోటీపడకుండా ఎన్‌టీఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సి) చర్యలు తీసుకుంటుందని ట్వీట్‌ చేశారు.  కాగా, జేఈఈ మేయిన్స్‌ పరీక్షలు జూలై 18 నుంచి 23 వరకు జరగాల్సి ఉండగా, కరోనా మహమ్మారి కారణంగా సెప్టెంబర్‌ 6వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌ 19న ఎన్‌డీఏ-ఎన్‌ఏ పరీక్ష సైతం కొవిడ్‌-19 వ్యాప్తి క్రమంలో వాయిదా వేసింది. అయితే పరీక్షను సెప్టెంబర్‌ 6న నిర్వహిస్తామని ఇటీవల యూపీపీఎస్పీ ప్రకటించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo