శనివారం 11 జూలై 2020
National - Jun 21, 2020 , 08:09:27

ఉచిత కరోనా పరీక్షల పేరిట డేటా చౌర్యం

ఉచిత కరోనా పరీక్షల పేరిట డేటా చౌర్యం

న్యూఢిల్లీ: దేశంలోని మహానగరాలైన హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, చెన్నైలోని స్థానికులందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించబోతున్నట్టు ప్రభుత్వ అధికారిక మెయిల్‌ అడ్రస్‌ను పోలిన మెయిల్‌ నుంచి సందేశాన్ని పంపిస్తారు. నిజమని భావించి ఈ-మెయిల్‌ను తెరిస్తే వైరస్‌తో కూడిన ఫైల్స్‌ను యూజర్‌ ఖాతాలోకి చొప్పించి డేటా చౌర్యానికి (వ్యక్తిగత, ఆర్థిక సమాచారం) పాల్పడుతారు. ఈ తరహా మోసాల నుంచి అప్రమత్తంగా ఉండాలని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్‌) హెచ్చరించింది. 

వ్యక్తిగత ఈ-మెయిల్‌ ఖాతాదారులు, వ్యాపార సంస్థలే లక్ష్యంగా డేటా చౌర్యానికి పాల్పడే వారి వద్ద ఇప్పటికే సుమారు 10 లక్షల ఈ-మెయిల్‌ అడ్రస్‌లు ఉన్నాయని, డేటా చౌర్యానికి సంబంధించిన కార్యకలాపాలు ఆదివారం నుంచి ప్రారంభం కావచ్చని వివరించింది. సైబర్‌ నేరగాళ్లు [email protected] తరహా ఈ-మెయిల్‌ ఐడీలను వాడొచ్చని, కొత్త ఐడీల నుంచి వచ్చే ఈ-మెయిల్స్‌, కొత్త నంబర్ల నుంచి వచ్చే సందేశాల్ని, సోషల్‌ మీడియాలో అనుమానాస్పద లింకులను తెరువవద్దని సూచించింది.


logo