శుక్రవారం 15 జనవరి 2021
National - Jan 01, 2021 , 18:48:08

డార్జిలింగ్ రోప్‌వే కార్య‌క‌లాపాలు తిరిగి ప్రారంభం

డార్జిలింగ్ రోప్‌వే కార్య‌క‌లాపాలు తిరిగి ప్రారంభం

కోల్‌క‌తా : ప‌శ్చిమ బెంగాల్‌లోని ప్రసిద్ధ హిల్ స్టేష‌న్‌లో డార్జిలింగ్ రోప్‌వే త‌న కార్య‌క‌లాపాల‌ను తిరిగి ప్రారంభించింది. కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి కార‌ణంగా డార్జిలింగ్ రోప్‌వే స‌ర్వీసులు దాదాపు 10 నెల‌ల‌పాటు మూత‌ప‌డ్డాయి. ప‌ర్యాట‌కులు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్న ఈ రోప్‌వే సేవ‌ల‌ను గురువారం నుంచి తిరిగి ప్రారంభించిన‌ట్లు క‌న్వెయ‌ర్‌, రోప్‌వే స‌ర్వీసెస్ అధికారి ఒక‌రు తెలిపారు. 

డార్జిలింగ్ రేంజిత్ వ్యాలీ ప్యాసింజర్ రోప్‌వే పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ పట్టణంలో ఉంది. దీనినే డార్జిలింగ్ రోప్‌వే అని కూడా అంటారు. ఇది ఆసియాలో పొడవైన ప్యాసింజర్ రోప్‌వేలలో ఒకటి. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ రోప్‌వే.