శనివారం 04 జూలై 2020
National - Jun 30, 2020 , 18:28:35

దెబ్బతిన్న డార్జిలింగ్‌ హిమాలయ రైల్వే ట్రాక్‌

దెబ్బతిన్న డార్జిలింగ్‌ హిమాలయ రైల్వే ట్రాక్‌

కోల్‌కతా : భారీ వర్షాలకు పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండ చరియలు విరిగిపడటంతో జాతీయ రహదారి-55లోని కొంత భాగం అదేవిధంగా డార్జిలింగ్‌ హిమాలయ రైల్వే ట్రాక్‌ దెబ్బతింది. డార్జిలింగ్‌ జిల్లాలోని కుర్సియాంగ్‌ పరిధిలోని దిగువ పగ్లాజోరా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సహాయక సిబ్బంది మరమ్మత్తు చర్యలు చేపట్టారు.
logo