బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 21, 2020 , 13:02:05

సుందరకాండ పారాయణంలో పాల్గొన్న దామోదర్ రావు

సుందరకాండ పారాయణంలో పాల్గొన్న దామోదర్ రావు

తిరుపతి : శ్రీవారి న‌వ‌రాత్రి‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధ‌‌‌‌వారం ఉదయం 9 గంట‌లకు  శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్సవ మండ‌పంలో మలయప్పస్వామి వారు ధ‌ను‌స్సు ధ‌రించి కోదండ‌రాముని అలంకారంలో దర్శనమిచ్చారు. హ‌నుమంత వాహ‌నం - భ‌గ‌వ‌త్ భ‌క్తి ప్రాప్తి హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. 

తిరుమల శ్రీవారిని టీటీడీ పాలకమండలి సభ్యులు దీవకొండ దామోదర్ రావు, జూపల్లి రామేశ్వర్ రావు, భాస్కర్ రావు, పార్థసారది రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ‌ సమయంలో వీరు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి  వారి దర్శనానంతరం శ్రీవారి‌ఆలయం వెలుపల నాధనీరాజనం‌వేదికలో జరిగే సుందరకాడపారాయణం కార్యక్రమంలో‌ పాల్గొన్నారు.

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు పుష్పక విమానం, రాత్రి 7 గంట‌ల‌కు గ‌జ వాహ‌న‌సేవ‌ జ‌రుగ‌నున్నాయి. కార్యక్రమంలో పెదజీయ‌ర్‌స్వామి, చినజీయ‌ర్‌స్వామి, ఈవో డా. కెఎస్‌. జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఏవీ.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, డా. నిశ్చిత‌, చిప్పగిరి ప్రసాద్,  గోవింద‌హ‌రి, డీపీ అనంత‌ తదితరులు పాల్గొన్నారు.