మంగళవారం 22 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 19:16:24

కోవిడ్‌ వారియర్స్‌ కోసం దాల్మియా ఆన్ లైన మ్యూజిక్ కన్సర్ట్

కోవిడ్‌ వారియర్స్‌ కోసం దాల్మియా  ఆన్ లైన మ్యూజిక్ కన్సర్ట్

ఢిల్లీ : కోవిడ్‌ వారియర్ల ధైర్యం, నిబద్ధత, స్థైర్యం వేడుక చేసే క్రమంలో దాల్మియా భారత్‌ గ్రూప్‌  ఇప్పుడు "జజ్బా–ఈ–భారత్‌" పేరుతో ఆన్‌లైన్‌ సంగీత విభావరిని నిర్వహిస్తున్నది. ఈ సంగీత విభావరిలో గాయకుడు కైలాష్‌ ఖేర్‌తో పాటుగా గ్రామీ అవార్డు విజేత రిక్కీ కేజ్‌లు పాల్గొననున్నారు. ఆగస్టు 14 తేదీ సాయంత్రం 6.15 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నది. ‘‘జజ్బా–ఈ–భారత్‌ వద్ద పద్మశ్రీ కైలాష్‌ ఖేర్‌ , గ్రామీ అవార్డు గ్రహీత రిక్కీ కేజ్‌లు పాల్గొనడం ఓ గౌరవంగా భావిస్తున్నాం. కరోనా మహమ్మారితో పోరాటంలో మన దేశంచూపుతున్న తెగువను గౌరవించేందుకు ఈ సంగీత విభావరిని లక్ష్యంగా చేసుకున్నాం. మన కోవిడ్‌ వారియర్లు చూపుతున్న అంకిత భావాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు. వారి నిబద్ధత స్ఫూర్తిదాయకం, వారి అవిశ్రాంత ప్రయత్నాలు, కోల్పోని వారి నమ్మకానికి మేము వందనాలనర్పిస్తున్నాం" అని దాల్మియా సిమెంట్‌ (భారత్‌ ) లిమిటెడ్‌ ఎండీ అండ్‌ సీఈఓ మహేంద్ర సింఘి అన్నారు. 


logo