శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Sep 22, 2020 , 21:15:18

దాల్మియా-ఓసీఎల్‌ నూతన ఫ్యాక్టరీ లైన్‌ను జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి

దాల్మియా-ఓసీఎల్‌ నూతన ఫ్యాక్టరీ లైన్‌ను జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి

ఢిల్లీ: ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రిఫ్రాక్టరీ కంపెనీ దాల్మియా –ఓసీఎల్‌ లిమిటెడ్‌ ఒడిషాలోని రాజ్‌గంగ్‌పూర్‌ ప్లాంట్‌లో ఏర్పాటుచేసిన మెగ్నీషియా కార్బన్‌ (ఎంజీఓ–సీ బ్రిక్స్‌) ఉత్పత్తి చేసేందుకు సిద్ధమైంది. అందుకోసం నూతన రిఫ్రాక్టరీ లైన్‌ను ఆవిష్కరించింది. ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఫగ్గాన్‌ సింగ్‌ కులస్తీ ఈ ఉత్పత్తి లైన్‌ ను ప్రారంభించారు. దీని ఉత్పత్తి సామర్థ్యం 1,08,000 టన్నులు. ఇది దేశీయ స్టీల్‌ తయారీదారుల అవసరాలను తీర్చనున్నది. కార్యకలాపాలు ప్రారంభిస్తే, మెగ్నీషియా కార్బన్‌ బ్రిక్స్‌ ఉత్పత్తి కోసం భారతదేశంలో అతిపెద్ద రిఫ్రాక్టరీ లైన్‌గా నిలువడంతో పాటుగా దేశపు దిగుమతుల భారాన్ని దాదాపు 50శాతం వరకూ తగ్గిస్తుందనే వాగ్ధానం చేస్తుంది.

ఈ రిఫ్రాక్టరీ లైన్‌ను దాల్మియా –ఓసీఎల్‌  ‘భారత్‌ కీ ఫ్యాక్టరీ మేఁ భారత్‌ కీ రిఫ్రాక్టరీ’ కార్యక్రమానికి అనుగుణంగా ఏర్పాటుచేశారు.ఇది మూడు దశలలో ఒక్కోటి 36వేల టన్నుల సామర్థ్యంతో వస్తుంది. ఈ ఉత్పత్తిని విస్తృతంగా స్టీల్‌ పరిశ్రమ వినియోగిస్తుంది. ప్రస్తుత డిమాండ్‌లో అధికశాతం దిగుమతులు (ప్రతి సంవత్సరం దాదాపు 3 లక్షల టన్నులు) ద్వారానే తీరుతున్నాయి. దాల్మియా–ఓసీఎల్‌ మొత్తంమ్మీద మరో 100 కోట్ల రూపాయలను రాబోయే ఐదేండ్లలో పెట్టుబడిపెట్టడంతో పాటు, తమ దేశీయ తయారీ సామర్థ్యంను వేగవంతం చేయడంతో పాటు ఈ దశాబ్దాంతానికి 300 మిలియన్‌ టన్నుల స్టీల్‌ తయారీ దేశంగా భారతదేశాన్ని మలువాలనే లక్ష్యానికి అనుగుణంగా ఉండనున్నది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 


logo