మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 12:23:06

పొలానికి నీళ్లు మళ్లించ‌‌నందుకు ద‌ళిత రైతు శిర‌చ్ఛేదం

పొలానికి నీళ్లు మళ్లించ‌‌నందుకు ద‌ళిత రైతు శిర‌చ్ఛేదం

బ‌దౌన్ : పొలానికి సాగునీరు మళ్లించేందుకు నిరాక‌రించిన‌ ఓ ద‌ళిత రైతును శిర‌చ్ఛేదం చేశారు. ఈ అమానుష సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బ‌దౌన్ జిల్లాలోని షేక్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. నాథులాల్ జాత‌వ్(56) అనే రైతు సోమ‌వారం పొద్దుపోయిన త‌ర్వాత త‌న‌ పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. రూప్ కిశోర్ అనే మ‌రో రైతు జాత‌వ్‌ను త‌న పొలానికి నీళ్లు మ‌ళ్లించాల్సిందిగా అడిగాడు. దీనికి జాత‌వ్ నిరాక‌రిస్తు త‌న పొలానికి నీళ్లు అవ‌స‌ర‌మ‌ని తెలిపాడు. దీంతో ఆగ్ర‌హించిన రూప్ కిశోర్ ద‌ళిత రైతును తీవ్రంగా కొట్టాడు. కొంత‌మంది అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ పార‌తో దాడి చేయ‌డంతో భ‌య‌భ్రాంతుల‌కు గురై అక్క‌డికి నుంచి పారిపోయాడు. అదే పార‌తో జాత‌వ్‌పై దాడి చేసి‌‌ శిర‌చ్ఛేదం చేశాడు.

బాధిత కుటుంబం ఫిర్యాదు మేర‌కు పోలీసులు హ‌త్య కేసు న‌మోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. జాత‌వ్ కుమారుడు ఓంపాల్ స్పందిస్తూ... తాను, త‌న తండ్రి ఇద్ద‌రం పొద్దుపోయేవ‌ర‌కు పొలంలో ప‌నిచేశాం. ఇంటికి వెళ్లి అన్నం కోసం ఏర్పాట్లు చేయ‌మ‌ని చెప్ప‌డంతో తాను ఇంటికి వెళ్లిన‌ట్లు తెలిపాడు. తెల్ల‌వారుజాము వ‌ర‌కు ఇంటికి తిరిగిరాక‌పోయేస‌రికి పొలానికి ప‌య‌న‌మ‌య్యాను. దారిలో త‌న తండ్రిని చంపిన‌ట్లుగా స్థానికుడొక‌రు చెప్పాడు. దీంతో పొలానికి వెళ్లి చూడ‌గా త‌ల‌, మొండెం వేరుగా ఉన్న‌ట్లు తెలిపాడు. రూప్ కిశోర్ ఒక్క‌డే ఈ హ‌త్య చేయ‌లేద‌ని ఇందులో ప‌లువురు స‌హ‌క‌రించిన‌ట్లుగా ఓంపాల్ తెలిపాడు. 


logo