సోమవారం 10 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 22:04:40

తైవాన్ మాజీ అధ్యక్షుడు లీ టెంగ్ హుయ్‌ మృతికి దలైలామా సంతాపం

తైవాన్ మాజీ అధ్యక్షుడు లీ టెంగ్ హుయ్‌ మృతికి దలైలామా సంతాపం

ధర్మశాల : తైవాన్ మాజీ అధ్యక్షుడు లీ టెంగ్ హుయ్‌ మృతికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా శుక్రవారం సంతాపం ప్రకటించారు. లీ టెంగ్ హుయ్‌ భార్య త్సెంగ్ వెన్‌హుయ్‌కి ఆయన లేఖ రాశారు. 1997లో మొదటిసారి తాను తైవాన్‌ను సందర్శించినప్పుడు లీ టెంగ్‌ హుయ్‌ని కలిసినట్లు మీకు తెలుసు. ఆ తర్వాత మేం తైవాన్‌తోపాటు అనేక చోట్ల పీస్ ఫోరమ్స్‌ వేదికలపై మళ్లీ కలిశాం. హుయ్‌ని వ్యక్తిగత స్నేహితుడిగా భావిస్తున్న. తైవాన్ ప్రజాస్వామ్య అభివృద్ధికి ఆయన అందించిన సహకారం అసాధారణం. తైవాన్ సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వంతో కూడిన శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దుకుందంటే అది లీ టెంగ్‌ హుయ్‌ చలువే. బహుశా మనం ఆయనకు అర్పించే అత్యుత్తమ నివాళి ఆయన ధైర్యాన్ని, అంకితభావాన్ని గుర్తుచేయడమే' అని ఆయన లేఖలో పేర్కొన్నారు.logo