సోమవారం 25 జనవరి 2021
National - Jan 07, 2021 , 07:35:34

మంచుపై పడవ ప్రయాణం!

మంచుపై పడవ ప్రయాణం!

శ్రీనగర్‌: సాధారణంగా కశ్మీర్‌ అంటేనే ప్రకృతి అందాలకే పెట్టిందిపేరు. చుట్టూ మంచుతో కప్పిన కొండలు.. వాటిపై సూర్యుడి లేలేత కిరణాలు. చూపరులను ఇట్టే కట్టిపడేసే ఇలాంటి దృష్యాలు కశ్మీర్‌లో సర్వసాధారణం. ఎప్పుడూ చల్లగా ఉండే కశ్మీరంలో చలికాలంలో వాతావరణం ఎలా ఉంటుంది.. ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు పడిపోయి ఎక్కడ చూసినా మంచు గుట్టలే కనిపిస్తాయి. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా విపరీతంగా మంచుకురుస్తున్నది. దీంతో సుప్రసిద్ధ దాల్‌ సరస్సు పాక్షికంగా గడ్డకట్టుకుపోయింది. దీంతో పడవలను మరో ఒడ్డుకు తీసుకెళ్లడానికి వాటిని నడిపేవాళ్లు ఇలా శ్రమిస్తున్నారు. అయితే పర్యాటకులు మాత్రం మైరచిపోతున్నారు.  




logo