గురువారం 09 జూలై 2020
National - May 06, 2020 , 17:01:02

రోజుకు 2500 మందికి కరోనా పరీక్షలు

రోజుకు 2500 మందికి కరోనా పరీక్షలు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో రోజుకు 2500 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అలపన్‌ బంధోపాధ్యాయ వెల్లడించారు. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం రాష్ట్రంలో మొత్తం 15 ల్యాబ్‌లను నిర్వహిస్తున్నామని, అందులో 10 ప్రభుత్వ ల్యాబ్‌లు కాగా, మరో 5 ప్రైవేట్‌ ల్యాబ్‌లు ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా మరో 112 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయయని, దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1456కు చేరిందని బంధోపాధ్యాయ చెప్పారు. అదేవిధంగా బుధవారం కొత్తగా నాలుగు మరణాలు కూడా సంభవించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 72కు చేరిందని ఆయన తెలిపారు.


logo