e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News మ‌రికొన్ని గంట‌ల్లో మ‌హారాష్ట్ర తీరానికి తౌక్తే తుఫాన్‌..!

మ‌రికొన్ని గంట‌ల్లో మ‌హారాష్ట్ర తీరానికి తౌక్తే తుఫాన్‌..!

మ‌రికొన్ని గంట‌ల్లో మ‌హారాష్ట్ర తీరానికి తౌక్తే తుఫాన్‌..!

ముంబై: అరేబియా స‌ముద్రంలో ఏర్ప‌డ్డ తౌక్తే తుఫాన్ తీరంవైపు దూసుకొస్తున్న‌ది. మ‌రికొన్ని గంట‌ల్లో అది మ‌హారాష్ట్ర తీరానికి చేరుకోనున్న‌ది. ప్రస్తుతం తౌక్తే తుఫాన్ తీరానికి 250 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌దని, ఈ రాత్రికిగానీ లేదంటే రేపు ఉద‌యంగానీ అది మ‌హారాష్ట్ర‌ తీరానికి చేరుకుంటుంద‌ని నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్‌) క‌మాండెంట్ అనుప‌మ్ శ్రీవాస్త‌వ తెలిపారు.

ఈ నేప‌థ్యంలో తాము ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని శ్రీవాస్త‌వ చెప్పారు. ముంబై తీర ప్రాంతాల్లో మూడు, గోవా తీరంలో ఒక‌టి, పుణె హెడ్ క్వార్ట‌ర్స్ ద‌గ్గ‌ర 14 టీమ్‌లు విప‌త్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఈ తుఫాన్‌ ప‌శ్చిమ తీర ప్రాంతానికి దూరంగానే ఉన్నందున ప్ర‌భావం త‌క్కువ‌గానే ఉండే అవ‌కాశం ఉంద‌న్నారు. అయితే బ‌ల‌మైన గాలులు, సాధార‌ణ‌ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మ‌రికొన్ని గంట‌ల్లో మ‌హారాష్ట్ర తీరానికి తౌక్తే తుఫాన్‌..!

ట్రెండింగ్‌

Advertisement