e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News ముంచుకొస్తున్న తౌక్తా తుఫాన్‌.. ఐదు రాష్ట్రాల‌పై ప్ర‌భావం..!

ముంచుకొస్తున్న తౌక్తా తుఫాన్‌.. ఐదు రాష్ట్రాల‌పై ప్ర‌భావం..!

ముంచుకొస్తున్న తౌక్తా తుఫాన్‌.. ఐదు రాష్ట్రాల‌పై ప్ర‌భావం..!

న్యూఢిల్లీ: అరేబియా స‌ముద్రంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం తుఫాన్‌గా మారి తీరం వైపు దూసుకొస్తున్న‌దని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఈ తుఫాన్ తీర ప్రాంత రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలపై ఎక్కువ‌గా ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉన్న‌ద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల్లో ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఆ ఐదు రాష్ట్రాల‌కు స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం కేంద్ర ప్ర‌భుత్వం NDRF బ‌ల‌గాల‌ను పంపించింది.

NDRFకు చెందిన 53 బృందాలను ఐదు రాష్ట్రాల్లో సిద్ధంగా ఉంచిన‌ట్లు NDRF డీజీ సత్యప్రధాన్ ట్వీట్ చేశారు. తౌక్తా తుపాన్ ప్ర‌భావంతో మే 16 నుంచి భారీ వర్షాలు కురువ‌నున్నాయ‌ని ఐఎండీ అధికారులు చెప్పారు. తుఫాన్‌వల్ల మే 15న గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. మే 16న గంటకు గాలి వేగం 80 కిలోమీటర్లకు పెరుగవచ్చని వారు అంచ‌నా వేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముంచుకొస్తున్న తౌక్తా తుఫాన్‌.. ఐదు రాష్ట్రాల‌పై ప్ర‌భావం..!

ట్రెండింగ్‌

Advertisement