సోమవారం 18 జనవరి 2021
National - Nov 25, 2020 , 16:14:28

పెను తుఫానుగా నివ‌ర్‌: NDRF డీజీ

పెను తుఫానుగా నివ‌ర్‌: NDRF డీజీ

న్యూఢిల్లీ: బ‌ంగాళాఖాతంలో ఏర్ప‌డిన నివ‌ర్ తుఫాను పెను తుఫానుగా మారిందని NDRF డీజీ ఎస్ఎన్ ప్ర‌ధాన్ వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో అందుకు త‌గ్గ‌ట్టుగానే ఏర్పాట్లు చేశామ‌ని ఆయ‌న తెలిపారు. తుఫాను న‌ష్టాన్ని సాధ్య‌మైనంత మేర‌కు త‌గ్గించ‌డం కోసం ఇప్ప‌టికే త‌మ బృందాల‌ను త‌మిళ‌నాడు, పుదుచ్చేరి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు త‌ర‌లించామ‌ని చెప్పారు. మొత్తం 25 బృందాలు ఇప్ప‌టికే క్షేత్ర స్థాయిలో సిద్ధంగా ఉన్నాయ‌ని, ప‌రిస్థితిని బ‌ట్టి అవ‌స‌ర‌మైన చోటుకు త‌ర‌లించ‌డం కోసం మ‌రో ఐదు బృందాల‌ను కూడా సిద్ధం చేసి ఉంచామ‌ని ప్ర‌ధాన్ వెల్ల‌డించారు. 

అదేవిధంగా తుఫాను నేప‌థ్యంలో త‌మిళ‌నాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల నుంచి ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్న‌ట్లు NDRF డీజీ ప్ర‌ధాన్ తెలిపారు. త‌మిళనాడులో 30 వేల మందిని, పుదుచ్చేరిలో 7 వేల మందిని ఇప్ప‌టికే సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించిన‌ట్లు చెప్పారు. నివ‌ర్ తుఫాన్‌ను ఎదుర్కోవ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేస్తున్నాయ‌న్నారు. తుఫాన్ న‌ష్టాన్ని త‌గ్గించ‌డానికి అవ‌కాశం ఉన్న చ‌ర్య‌లు తీసుకుని సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు.       

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.