శనివారం 30 మే 2020
National - May 16, 2020 , 13:17:20

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం

హైదరాబాద్‌ : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఒడిశాలోని పారాదీప్‌కు 1100 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. సాయంత్రానికి తుపానుగా బలపడే సూచనలు కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బెంగాల్‌కు దక్షిణ దిశగా 1250 కిలోమీటర్ల దూరంలో, బంగ్లాదేశ్‌ ఖేపుపరకు దక్షిణ నైరుతి దిశగా 1330 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. తదుపరి 24 గంటల్లో వాయుగుండం తీవ్ర తుపానుగా మారే సూచన ఉందన్నారు. తొలుత మే 17 వరకు ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించింది. మే 18 నుంచి మే 20 తేదీల్లో బెంగాల్‌ తీరం వైపు వాయుగుండం ప్రయాణించే అవకాశం ఉంది. 

అయితే వాయుగుండం మరింత బలపడి తుపాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీనికి ఎంఫాన్‌గా నామకరణం చేశారు అధికారులు. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవులకు దక్షిణ దిశలో కిలోమీటర్ ఎత్తున ఎంఫాన్ తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం దక్షిణ మధ్య బంగాళాఖాతం దిశగా ప్రయాణించి.. శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయానికి తుపాన్‌గా మారనుంది. ఈ తుపాను ప్రభావం ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరం వెంబడి అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది. 


logo