శనివారం 30 మే 2020
National - May 21, 2020 , 11:23:40

నీటమునిగిన కోల్‌కతా విమానాశ్రయం.. వీడియో

నీటమునిగిన కోల్‌కతా విమానాశ్రయం.. వీడియో

కోల్‌కతా: అంఫాన్‌ తుఫాను ప్రభావంతో కుండపోతగా వర్షం కురవడంతో కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయం జలదిగ్భందమయ్యింది. రన్‌వే, హాంగర్లు పూర్తిగా నీటమునిగాయి. వర్షానికితోడు బలమైన ఈదురు గాలుతో విమానాశ్రయంలోని కొన్ని నిర్మాణాలు విరిగిపడ్డాయి. దీంతో విమనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఎయిర్‌పోర్టులో అన్ని కార్యకలాపాలను ఉదయం 5 గంటలకు పూర్తిగా నిలిపివేశారు. వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి మార్చి 25న లాక్‌డౌన్‌ విధించడంతో ప్రయాణికుల విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం కార్గో విమానాలను మాత్రమే నడుపుతున్నారు.    

అంఫాన్‌ తుఫాన్‌ బెంగాల్‌లో బీభత్సం సృష్టించింది. తుఫాన్‌ వల్ల ఇప్పటివరకు 12 మంది చనిపోయారు. బలమైన ఈదురుగాలులు, వర్షాల వల్ల వేలాది ఇండ్లు ధ్వంసమయ్యాయి. బెంగాల్‌ తీరం వెంబడి గంటకు 120 కిలీమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.logo