సోమవారం 13 జూలై 2020
National - Jun 28, 2020 , 06:31:15

ఆన్‌లైన్‌ క్లాసుల్లో అశ్లీలం సైబర్‌ నేరగాళ్ల దుశ్చర్యలు

ఆన్‌లైన్‌ క్లాసుల్లో అశ్లీలం సైబర్‌ నేరగాళ్ల దుశ్చర్యలు

న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ వల్ల స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు టీచర్లు ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. అయితే, సైబర్‌ నేరగాళ్ల చర్యలతో ఆన్‌లైన్‌ క్లాసులు కూడా సజావుగా సాగడంలేదు. క్లాసులు కొనసాగుతున్న సమయంలో అన్‌లైన్‌ స్క్రీన్‌లలోకి దుండగులు చొరబడుతూ.. అశ్లీల వీడియోలు, మెసేజీలతో ఇటు విద్యార్థులను, అటు టీచర్లను బెంబేలెత్తిస్తున్నారు. కోల్‌కతా, ఢిల్లీలో ఇటీవల ఇలాంటి ఘటనలు కొన్ని జరిగాయి. దీంతో ఆయా పాఠశాలలు ఆన్‌లైన్‌ పాఠాలను కొన్ని రోజులపాటు వాయిదా వేశాయి.

సైబర్‌ నేరగాళ్లు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలంటే.. టీచర్లు, స్కూల్‌ యాజమాన్యాలు సైబర్‌ భద్రతా నియమాలు పాటించాలని సైబర్‌ భద్రతా నిపుణుడు పవన్‌ దుగ్గల్‌ తెలిపారు. అథెంటికేటెడ్‌ (ప్రామాణికమైన) హోస్ట్‌ సర్వర్లు, నమ్మదగిన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు, యాప్‌ల నుంచే ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహించాలని సూచించారు. 


logo