మంగళవారం 31 మార్చి 2020
National - Feb 19, 2020 , 02:28:12

సీరియల్‌ కిల్లర్‌ మోహన్‌కు జీవిత ఖైదు

సీరియల్‌ కిల్లర్‌ మోహన్‌కు జీవిత ఖైదు
  • 19వ హత్యకేసులో మంగళూరు కోర్టు తీర్పు
  • 20 మంది యువతులపై లైంగికదాడి చేసి ‘సైనైడ్‌'తో అంతం
  • ఐదు కేసుల్లో ఉరిశిక్ష, మరో మూడు కేసుల్లో జీవిత కారాగారం

మంగళూరు, ఫిబ్రవరి 18: సీరియల్‌ కిల్లర్‌ మోహన్‌కు మరో హత్యకేసులో జీవిత కారాగార శిక్ష పడింది. 2006లో కేరళలోని కాసర్గోడ్‌ జిల్లాకు చెందిన 23 ఏండ్ల యువతిపై లైంగికదాడి జరిపి అనంతరం ‘సైనైడ్‌' మాత్రతో హత్య చేసిన కేసుకు సంబంధించి కర్ణాటకలోని మంగళూరు కోర్టు తీర్పు ఇచ్చింది. ఆరో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్డు జడ్జి సయీదున్నీసా, దోషికి జీవిత ఖైదుతోపాటు రూ. 25 వేల జరిమానా విధించారు. బాధితురాలి తల్లికి ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని జిల్లా న్యాయ సేవల అథారిటీకి సూచించారు. మోహన్‌పై 20 హత్య కేసులు నమోదుకాగా 19వ హత్య కేసులో కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అతడు 20 మంది యువతులపై లైంగికదాడి చేసి అనంతరం ‘సైనైడ్‌' పూత పూసిన మాత్ర ఇచ్చి హతమార్చాడు. 2009లో బంట్వాల్‌లో ఉన్న మోహన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఐదు కేసుల్లో ఉరిశిక్ష, మరో మూడు కేసుల్లో జీవిత ఖైదు శిక్షలను కోర్టులు విధించాయి. 


logo
>>>>>>