శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 22, 2021 , 15:32:21

జూన్ చివ‌రిక‌ల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడి ఎన్నిక‌..!

జూన్ చివ‌రిక‌ల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడి ఎన్నిక‌..!

న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ చివ‌రి నాటికి పార్టీకి పూర్తిస్థాయి అధ్య‌క్షుడిని ఎన్నుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యించింది. ఇవాళ ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ (సీడ‌బ్ల్యూసీ) స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫ‌లితాన్ని సాధించ‌లేకపోవ‌డంతో అందుకు నైతిక బాధ్య‌త వ‌హిస్తూ అప్ప‌టి కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అప్ప‌టి నుంచి ఆయ‌న త‌ల్లి సోనియాగాంధీ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలిగా కొన‌సాగుతున్నారు. 

ఈ నేప‌థ్యంలో ఇవాళ సీడ‌బ్ల్యూసీ స‌మావేశ‌మై అధ్య‌క్షుడి ఎన్నిక‌పై నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యాన్ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్ల‌డించారు. అంతేగాక కాంగ్రెస్ వ‌ర్కింగ్ కమిటీ రైతుల ఉద్య‌మానికి మ‌ద్దతుగా, క‌రోనా వైర‌స్‌కు టీకాలు క‌నిపెట్టిన శాస్త్ర‌వేత్త‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ, వాట్సాప్ చాట్ లీక్‌పై జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీ వేయాల‌ని కోరుతూ ప‌లు తీర్మానాలు చేసింద‌ని కేసీ వేణుగోపాల్ తెలిపారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo