గురువారం 26 నవంబర్ 2020
National - Nov 20, 2020 , 18:58:48

చెన్నై విమానాశ్రయంలో 4 కేజీల బంగారం పట్టివేత

చెన్నై విమానాశ్రయంలో 4 కేజీల బంగారం పట్టివేత

చెన్నై : దేశంలోని పలు అంతర్జాతీయ విమానాశ్రయ నుంచి బంగారం అక్రమంగా జరుగుతుండటంతో  అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రెవెన్యూ  ఇంటెలిజెన్స్‌ అధికారులు, కస్టమ్స్‌ అధికారులు గట్టి నిఘా పెడుతున్నారు. గురు, శుక్రవారాల్లో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రమం నుంచి స్మగ్లర్లు అక్రమంగా తరలించేందుకు యత్నించిన నాలుగు కేజీల బంగారాన్ని  స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 2.06 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఆరుగురు ప్రయాణికుల వద్ద బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. కాగా గురువారం ఢిల్లీలో అక్రమంగా రవాణా అవుతున్న 66 కేజీల బంగారాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకొని ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.