1.28 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం

తిరువనంతపురం : కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గురువయూర్లోని ఈస్ట్ నాడాలో ఓ ఫారెన్ ఎక్స్చేంజ్ ఏజెన్సీలో సోదాలు చేశారు. అక్కడున్న రూ. 1.28 కోట్ల విలువ చేసే విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా అక్రమంగా దాచిన రూ. 44.56 లక్షల ఇండియన్ కరెన్సీని కూడా సీజ్ చేశారు అధికారులు. ఈ ఏజెన్సీకి ఎలాంటి గుర్తింపు లేదని అధికారులు తేల్చారు. ఏజెన్సీ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Customs Dept seized Rs 1.28 cr worth of foreign currency from a foreign exchange agency in East Nada at Guruvayur in Thrissur. Illegally kept Rs 44.56 lakhs also seized. Customs found that agency had no legal documents/license: Commissionerate of Customs(Preventive) Kochi, Kerala pic.twitter.com/z0rIiJ8oAL
— ANI (@ANI) January 25, 2021