బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Aug 15, 2020 , 07:32:50

పాఠ్యాంశాలుగా ‘కరోనా-పౌరుల విధులు’

పాఠ్యాంశాలుగా ‘కరోనా-పౌరుల విధులు’

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో ప్రజల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో పాఠశాల స్థాయిలో పాఠ్యాంశాల్లో పౌరుల విధులను చేర్చాలని ఎన్సీఈఆర్టీని, రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. శుక్రవారం అసోచామ్‌ నిర్వహించిన వెబినార్‌లో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి బరున్‌ మిత్రా మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు. దీని విధి విధానాలపై కేంద్ర న్యాయవ్యవహారాల విభాగం దృష్టి సారించిందన్నారు. logo