గురువారం 24 సెప్టెంబర్ 2020
National - Aug 04, 2020 , 06:45:49

శ్రీనగర్‌లో కర్ఫ్యూ

శ్రీనగర్‌లో కర్ఫ్యూ

శ్రీనగర్‌ : ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ను రద్దు చేసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వేర్పాటువాదులు నిరసనలకు దిగే అవకాశం ఉండడంతో శ్రీనగర్‌ పరిపాలన యంత్రాంగం సోమవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు కర్ఫ్యూను విధించారు. అలాగే జూలై 31 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు విధించిన కొవిడ్‌-19 సంబంధిత ఆంక్షలు సైతం 8వ తేదీ వరకు పొడగించారు. ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏ గతేడాది ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దయింది. అలాగే ఏడు దశాబ్దాలు కొనసాగిన ప్రత్యేక ప్రతిపత్తి రద్దయి, కేంద్ర ప్రభుత్వ పాలనలోకి వచ్చింది. ఇదిలా ఉండగా.. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏర్పాటు వాదులు, పాకిస్థాన్‌ ప్రేరేపిత శక్తులు ఆగస్టు 5న బ్లాక్‌ డేగా జరుపుకోవాలని యోచిస్తున్నాయని, దీంతో హింస జరిగే హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు.

‘ప్రజా జీవితం.. ఆస్తికి అపాయకరమైన హింసాత్మక నిరసనల గురించి నిర్దిష్ట సమాచారం ఉంది’ అని శ్రీనగర్ షాహిద్ చౌదరి జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో సమావేశాలు నిర్వహించడం ఆందోళనకరమన్నారు. ‘హింసాత్మక, ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు కర్ఫ్యూ విధించడం చాలా అవసరం’ అన్నారు. ఇదిలా ఉండగా కర్ఫ్యూపై మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాశ్మీర్‌ లోయ అంతటా ఆంక్షలు ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రెండు రోజులు కఠినమైన కర్ఫ్యూ కింద ఉంచబడుతున్నాను’ అని ట్వీట్‌ చేశారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo