శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 20:45:41

బెంగళూరులో కర్ఫ్యూ..

బెంగళూరులో కర్ఫ్యూ..

బెంగళూరు : కరోనా మహమ్మారిని అదుపు చేసేందుందుకు బెంగళూరు నగరంలో శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని నగర పోలీస్‌ కమిషనర్‌ భాస్కర్‌రావు తెలిపారు. ప్రజలందరు దీనికి సహకరించాలని, ఇంటి వద్దనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది ప్రజా ప్రయోజనానికి సంబంధించిందని, కారణం లేకుండా బయటకు వచ్చే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో, ముఖ్యంగా రాజధాని నగరంలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం కర్ణాటకలో 2,313 కొత్త కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. కర్ణాటకలో మొత్తం 33,418 కొవిడ్‌-19 ధ్రువీకరించారని పేర్కొన్నారు. వీటిలో 19,039 యాక్టివ్‌ కేసులున్నాయి. మరో 543 మంది కరోనా ప్రభావంతో మృతి చెందారు.
logo