బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 19, 2020 , 12:15:02

నిర్భయ దోషి ప‌వ‌న్ గుప్తా క్యూరేటివ్ పిటిష‌న్ కొట్టివేత‌

నిర్భయ దోషి ప‌వ‌న్ గుప్తా క్యూరేటివ్ పిటిష‌న్ కొట్టివేత‌

హైద‌రాబాద్‌: నిర్భ‌య రేప్ కేసు నిందితుడు ప‌వ‌న్ గుప్తా వేసిన క్యూరేటివ్ పిటిష‌న్‌ను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. తాను బాల్య నేర‌స్థుడిన‌ని పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను కోర్టు తిర‌స్క‌రించింది.  2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో.. న‌లుగురు నిందితుల‌కు రేపు ఉరి తీయ‌నున్నారు.  తీహార్ జైల్లో ఉరి విధించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.  తాజా తీర్పు ప‌ట్ల నిర్భ‌య త‌ల్లి ఆశాదేవి స్పందించారు.  ఉరి శిక్ష అమ‌లు చేయ‌కుండా నిందితులు కోర్టును ఆశ్ర‌యించ‌డం అల‌వాటుగా మారింద‌ని, నిందితులు వేస్తున్న జిత్తుల‌ను కోర్టులు అర్థం చేసుకుంటున్నాయ‌ని ఆశాదేవి అన్నారు. రేపు  క‌చ్చితంగా నిర్భ‌య‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని ఆమె తెలిపారు.


logo
>>>>>>