శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 20, 2020 , 19:53:40

ఉగ్రవాదులంతా మదర్సాల్లో పెరిగారు : మంత్రి ఉషా ఠాకూర్‌

ఉగ్రవాదులంతా మదర్సాల్లో పెరిగారు : మంత్రి ఉషా ఠాకూర్‌

భోపాల్‌ : మధ్య ప్రదేశ్‌లో వరుసగా మూడవ రోజు కూడా నాయకుల వైరుధ్య వాక్చాతుర్యం కొనసాగుతున్నది. మాజీ సీఎం కమల్‌నాథ్.. మంత్రిని "ఐటం"గా అంటూ చేసిన వ్యాఖ్యలతో.. ఈ వ్యాఖ్యల సిరీస్ కొనసాగుతున్నది. ప్రతిపక్ష నాయకుడి భార్యను "ఉంపుడుగత్తె" గా ఒక మంత్రి అభివర్ణించగా.. ఇప్పుడు రాష్ట్ర సాంస్కృతిక మంత్రి ఉషా ఠాకూర్.. మరో వివాదాస్పద ప్రకటన చేశారు. ఉగ్రవాదులందరూ మదర్సాల్లో పెరిగారని, జమ్ముకశ్మీర్‌ను ఉగ్రవాద కర్మాగారంగా మార్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో కూడా ఉషా ఠాకూర్‌ గార్భేకు ముస్లింలను అనుమతించవద్దని, కన్హయ్యకు ఆయన తల్లి దేశభక్తిని నూరిపోయలేదని.. పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

'పిల్లలందరికీ సమాన విద్య ఇవ్వాలి. మతం ఆధారిత విద్య మూర్ఖత్వాన్ని వ్యాప్తి చేస్తున్నది. ద్వేషం వ్యాప్తి చెందుతుంది. జాతీయవాదంతో సమాజంలోని ప్రధాన స్రవంతితో అనుసంధానించలేని మదర్సాలు, మనం వారిని సరైన విద్యతో అనుసంధానించాలి. ప్రతి ఒక్కరి పురోగతి కోసం సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలి' అని ఉషా ఠాకూర్‌ అన్నారు. అంతటితో ఊరుకోకుండా జాతీయ ప్రయోజనాలకు అడ్డుపడే మదర్సాలను మూసివేయాలని, అసోంలో ఆ పని చేసి చూపారని చెప్పారు. మదర్సాలకు ప్రభుత్వ సహాయం నిలిపివేయాలన్నారు. ఎవరైనా తమ మతపరమైన ఆచారాలను ప్రైవేటుగా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే రాజ్యాంగం దానిని అనుమతిస్తుందని పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో 14 శాతంగా ఉన్న హిందువులు ఇప్పుడు ఒక్క శాతానికే పరిమితమయ్యారని, చిత్రహింసల కారణంగానే హిందువుల జనాభా అంత తక్కువకు చేరుకున్నదని చెప్పారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.