బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 30, 2020 , 11:24:02

నేర‌స్థుల‌ను విడిచిపెట్టేది లేదు: ‌యోగీ ఆదిత్య‌నాథ్

నేర‌స్థుల‌ను విడిచిపెట్టేది లేదు: ‌యోగీ ఆదిత్య‌నాథ్

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ‌యువ‌తిపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ‌ట‌మేగాక నాలుక కోసి ఆమె మ‌ర‌ణానికి కార‌ణ‌మైన నేర‌గాళ్ల‌ను విడిచిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్ప‌ష్టంచేశారు. ఈ దారుణ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు కోసం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేశామ‌ని ఆయ‌న చెప్పారు. ఈ స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్ స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌రిపి వారం రోజుల్లో నివేదిక స‌మ‌ర్పించ‌నుంద‌ని యోగీ తెలిపారు. 

ఈ కేసులో బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం జ‌రిగేలా చూస్తామ‌ని యోడీ ఆదిత్య‌నాథ్ హామీ ఇచ్చారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచార‌ణ జ‌రిపిస్తామ‌ని చెప్పారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని ప్ర‌ధాని కూడా త‌న‌ను ఆదేశించార‌ని యోగీ తెలిపారు. రెండు వారాల క్రితం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హ‌త్రాస్ జిల్లాలో 19 ఏండ్ల యువ‌తిపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అంతటితో ఆగ‌క ఆమె నాలుక కోసి చిత్ర‌హింస‌ల‌కు గురిచేశారు. దీంతో రెండు వారాల‌పాటు మృత్యువుతో పోరాడిన ఆమె మంగ‌ళ‌వారం మ‌రణించింది.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo