బుధవారం 03 జూన్ 2020
National - May 08, 2020 , 02:28:52

53 జన్యు క్రమాల్ని సేకరించిన సీఎస్‌ఐఆర్‌!

53 జన్యు క్రమాల్ని సేకరించిన సీఎస్‌ఐఆర్‌!

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పరివర్తన చెందుతున్నదని, అంచనా వేసినదానికంటే వేగంగా వైరస్‌ వ్యాపిస్తున్నదని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మనదేశంలోనే ప్రముఖ పరిశోధన, అభివృద్ధి సంస్థ కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) కీలక సమాచారాన్ని సేకరించింది. వైరస్‌ సోకిన భారతీయుల నుంచి దాదాపు 53 జన్యు క్రమాల సమాచారాన్ని సేకరించి.. గ్లోబల్‌ ఇనిషియేటివ్‌ ఆన్‌ షేరింగ్‌ ఆల్‌ ఇన్‌ఫ్లూయెంజా డాటా (జీఐఎస్‌ఏఐడీ)కి అందించింది. ఈ సమాచారం వైరస్‌ గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి సాయపడుతుందని, అలాగే వ్యాక్సిన్‌ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మే 15 నాటికి మరో 450 జన్యు క్రమాల సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ శేఖర్‌ మండే తెలిపారు.


logo