ముంబై ,మే 12: ఇటీవల క్రిప్టోకరెన్సీ పై చాలామందికి ఆసక్తి పెరుగుతున్నది. ముఖ్యంగా ఎథేరియం, బిట్ కాయిన్, లైట్ కాయిన్, డోజికాయిన్ వంటివాటికి ఆదరణ పెరుగుతుండడంతో అవి మరింతగా ఎగిసిపడుతున్నాయి. బిట్ కాయిన్ వంటివి ఆల్ టైమ్ గరిష్టంతో క్షీణించినప్పటికీ ఏడాది ప్రాతిపదికన చూస్తే ఎన్నో రెట్ల రిటర్న్స్ అందించాయి. క్రిప్టోకరెన్సీ పై జనాలకు ఎన్నో అనుమానాలున్నాయి. ఇది తాత్కాలికమేననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడుల కోసం బంగారంతో పాటు క్రిప్టోను కూడా ఎంచుకుంటున్నారు. క్రిప్టో అంచనాలు కాస్త కష్టమే. అయితే క్రిప్టోకరెన్సీ రేట్స్ ఎలాఉన్నాయనే విషయం తెలుసుకుందాం..
బిట్ కాయిన్, ఎథేరియం.. లిట్కాయిన్- ఈ వారం లిట్కాయిన్(ఎల్టీసీ) 35 శాతం ఎగిసింది. ఈ నెలలో ఇది మరింతగా ఎగిసిపడే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఎథేర్- ఎథేరియం మంగళవారం ఆల్ టైమ్ గరిష్టం నుంచి తగ్గింది. ఎథేరియం 4070ను తాకింది. బిట్ కాయిన్- బిట్ కాయిన్ వ్యాల్యూ ఇటీవల తగ్గుతున్నది. గత 24 గంటల్లోనే 5 శాతం మేర క్షీణించింది. ఓ సమయంలో ఇది 64వేల డాలర్లను క్రాస్ చేసింది. ప్రస్తుతం 56వేలకు సమీపంలో ఉంది. డోజీకాయిన్- డోజీ కాయిన్ ఇటీవల బాగా వినిపిస్తున్నపేరు. అతికొద్ది కాలంలోనే పది రెట్లు ఎగిసింది. గత వారం ఓ సమయంలో 0.74 డాలర్లకు పెరిగింది. మంగళవారం డోజీ 0.50 డాలర్ల వద్ద ఉన్నది.