కోల్కతా: పశ్చిమబెంగాల్లో నాటుబాంబులు కలకలం రేపాయి. ఉత్తర 24 పరగణాల జిల్లా జగదాల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని భట్పారా ఏరియాలో ఓ పాడుబడ్డ ఇంట్లో ఆదివారం రాత్రి రెండు బకెట్లలో నాటుబాంబులు లభ్యమయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఆ నాటు బాంబులను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.