బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 18, 2020 , 10:44:32

ఐదు కేజీల ఐఈడీ బాంబు నిర్వీర్యం

ఐదు కేజీల ఐఈడీ బాంబు నిర్వీర్యం

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్‌ అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం సీఆర్పీఎఫ్‌ బలగాలు కూంబింగ్‌ నిర్వహించాయి. బావ్నిమరి గ్రామం, బత్రాల మధ్య ఐదు కేజీల ఐఈడీ బాంబును బలగాలు గుర్తించాయి. టిఫిన్‌ బాక్సులో రోడ్డుపై అమర్చిన బాంబును పసిగట్టిన సీఆర్పీఎఫ్‌ బలగాలు.. దాన్ని నిర్వీర్యం చేశాయి. ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ ప్రాంతంలో బలగాల కూంబింగ్‌ కొనసాగుతుంది.


logo
>>>>>>