శనివారం 06 జూన్ 2020
National - May 19, 2020 , 10:49:38

ఉగ్రవాదుల దాడి.. సీఆర్పీఎఫ్‌ జవాను, పోలీసుకు గాయాలు

ఉగ్రవాదుల దాడి.. సీఆర్పీఎఫ్‌ జవాను, పోలీసుకు గాయాలు

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని నవకదాల్‌ ఏరియాలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు సీఆర్పీఎఫ్‌ జవాన్లు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్‌ జవానుతో పాటు మరో పోలీసుకు గాయాలయ్యాయి. వీరిద్దరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే నవకదాల్‌ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు పక్కా సమాచారం అందడంతో.. బలగాలు నిన్న రాత్రి నుంచి అక్కడ కూంబింగ్‌ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు తారసపడటంతో ఎదురుకాల్పులు జరిగాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఏరియాలో ఇంటర్నెట్‌ సేవలను పోలీసులు నిలిపివేశారు. 


logo