బుధవారం 03 జూన్ 2020
National - May 11, 2020 , 17:23:09

ఎదురుకాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ జ‌వాను మృతి

ఎదురుకాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ జ‌వాను మృతి

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌:  రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ ఘ‌ట‌న‌లో సీఆర్‌పీఎఫ్ జ‌వాను మృతి చెందాడు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల ప్రాంతంలో జిల్లాలోని ఉరిపాల్ అట‌వీ ప్రాంతంలో గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్న సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్స్‌, రాష్ట్ర పోలీసుల జిల్లా రిజ‌ర్వ్ గార్డు బృందంపై మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. అక‌స్మాత్తుగా జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో సీఆర్‌పీఎఫ్ 170 బెటాలియ‌న్‌కు చెందిన కానిస్టేబుల్ మున్నా కుమార్‌(32) మృతి చెందాడు. మృతుడు జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాకు చెందిన వాడు. సీఆర్పీఎఫ్ బ‌ల‌గాలు ఎదురుకాల్పులు జ‌ర‌ప‌డంతో మావోయిస్టులు అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. ఘ‌ట‌నా స్థ‌లంలో భారీగా ఆయుధ సామాగ్రీ స్వాధీనం చేసుకున్నారు. 


logo