శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 17, 2020 , 15:55:16

ఉగ్ర‌వాదుల దాడిలో సీఆర్పీఎఫ్ జ‌వాన్‌కు గాయాలు

ఉగ్ర‌వాదుల దాడిలో సీఆర్పీఎఫ్ జ‌వాన్‌కు గాయాలు

శ్రీన‌గ‌ర్ : ద‌క్షిణ క‌శ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో గురువారం ఉద‌యం ఉగ్ర‌వాదులు సైనికులే ల‌క్ష్యంగా గ్రెనేడ్ల‌తో దాడి చేశారు. దీంతో సీఆర్పీఎఫ్ జ‌వాన్‌కు గాయాల‌య్యాయి. గాయ‌ప‌డ్డ జ‌వాన్‌ను సీఆర్పీఎఫ్ 40వ బెటాలియ‌న్‌కు చెందిన పాటిల్ ప‌ద్మాక‌ర్‌గా ఉన్న‌తాధికారులు గుర్తించారు. చికిత్స నిమిత్తం జ‌వాన్‌ను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం జ‌వాన్ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. 


logo