బుధవారం 03 జూన్ 2020
National - May 11, 2020 , 20:27:02

ఛత్తీస్‌గడ్‌లో ఎదురుకాల్పులు : జవాను మృతి

ఛత్తీస్‌గడ్‌లో ఎదురుకాల్పులు : జవాను మృతి

చర్ల రూరల్ : ఛత్తీస్‌గడ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్‌ జిల్లా మిర్తూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిథిలోని హుర్పాల్‌ అటవీప్రాంతంలో సోమవారం ఉదయం మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సీఆర్‌పీఎఫ్‌ 170 బెటాలియన్‌కి చెందిన జవాన్‌ మున్నా యాదవ్‌ (జార్ఘండ్‌) మృతి చెందారు. బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ ఈ విషయం ధృవీకరించారు. మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్‌, డిఎఫ్‌ సిబ్బంది ఆదివారం కూంబింగ్‌కి వెళ్ళి  సోమవారం తిరిగివస్తుండగా మావోయిస్టులు తారసపడి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ గాయపడ్డారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. తప్పించుకుపోయిన మావోయిస్టుల కోసం గంగులూరు - మిర్తూర్‌ అటవీప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశారు. మున్నా యాదవ్‌ మృతదేహాన్ని జార్ఘండ్‌లోని స్వగ్రామానికి పంపించడానికి పోలీస్‌ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


logo