మంగళవారం 07 జూలై 2020
National - Jun 27, 2020 , 16:25:41

ఢిల్లీలో క‌రోనాతో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ మృతి

ఢిల్లీలో క‌రోనాతో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ మృతి

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇటీవ‌ల క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డ సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ మృతిచెందాడు. ఆయ‌న వ‌య‌సు 44 ఏండ్లు. విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా గ‌త కొంత‌కాలం నుంచి ఢిల్లీలో ఉంటున్న‌ ఆయ‌న ఇటీవ‌ల అనారోగ్యానికి గురికావ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ ఆయ‌న‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా పాజిటివ్ వ‌చ్చింది. అప్ప‌టికే అక్క‌డే చిక‌త్స పొందుతున్న ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈ రోజు ప్రాణాలు కోల్పోయారు.

కాగా, శ‌నివారం మృతిచెందిన జ‌వాన్‌తో క‌లిపి సీఆర్‌పీఎఫ్‌లో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 8కి చేరింది. అదేవిధంగా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 1,046కు చేరుకుంది. సీఆర్‌పీఎఫ్ ఉన్న‌తాధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.    

    


logo