గురువారం 09 జూలై 2020
National - Jul 01, 2020 , 08:54:15

జమ్ములో ఉగ్రవాదుల కాల్పులు.. జవాన్‌తోసహా ఇద్దరి మృతి

జమ్ములో ఉగ్రవాదుల కాల్పులు.. జవాన్‌తోసహా ఇద్దరి మృతి

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌లో సీఆర్‌పీఎఫ్‌ బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఒక సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌తోపాటు, ఓ పౌరుడు మృతిచెందారు. ఈ కాల్పుల్లో మరో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. బారాముల్లాల జిల్లాలోని సోపోర్‌ పట్టణంలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు బుధవారం ఉదయం ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. వారిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో నలుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు తీవ్రంగా గాయపడగా, అటుగా కారులో వెళ్తున్న ఓ పౌరుడు అక్కడికక్కడే మరణించాడని జమ్ముకశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ ప్రకటించారు. గాయపడిన వారిని దవాఖానకు తరలించామని, అందులో ఓ జవాన్‌ మృతిచెందాడని చెప్పారు. ఉగ్రవాదులకోసం గాలింపు కొనసాగుతున్నదని తెలిపారు.


logo