బుధవారం 27 మే 2020
National - May 12, 2020 , 11:16:45

సీఆర్‌పీఎఫ్ ఏఎస్ఐ ఆత్మ‌హ‌త్య‌

సీఆర్‌పీఎఫ్ ఏఎస్ఐ ఆత్మ‌హ‌త్య‌

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో దారుణం జ‌రిగింది. సెంట్ర‌ల్ రిజ‌ర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌)కు చెందిన ఒక అసిస్టెంట్ స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. జ‌మ్ముక‌శ్మీర్‌లోని శ్రీన‌గ‌ర్‌లో విధులు నిర్వ‌హిస్తున్న ఆయ‌న ఈ తెల్ల‌వారుజామున త‌న స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అయితే ఏఎస్ఐ ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేద‌ని సీఆర్‌పీఎఫ్‌ అధికారులు తెలిపారు. జ‌రిగిన విష‌యాన్ని అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు తెలియ‌జేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఘ‌ట‌న‌పై అంత‌ర్గ‌త ద‌ర్యాప్లు చేప‌ట్టిన‌ట్టు తెలిపారు.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo