మంగళవారం 02 జూన్ 2020
National - Apr 06, 2020 , 11:13:02

కుప్ప‌లుగా కాకుల చావులు.. ప్ర‌జ‌ల్లో క‌రోనా భ‌యాలు

కుప్ప‌లుగా కాకుల చావులు.. ప్ర‌జ‌ల్లో క‌రోనా భ‌యాలు

చెన్నై: అది త‌మిళ‌నాడులోని కుగ్రామం! క‌రోనా విజృంభ‌న, లాక్‌డౌన్ అమ‌లు నేప‌థ్యంలో అన్ని గ్రామాల ప్ర‌జ‌ల లాగే ఆ గ్రామ‌స్తులు కూడా ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. బ‌య‌ట‌కు వెళ్తే ఎక్క‌డ‌ క‌రోనా మ‌హ‌మ్మారి ప‌ట్టుకుంటుందోన‌ని భ‌యంతో బిక్కుబిక్కుమంటున్నారు. అయితే ఆ గ్రామంలో గ‌త కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు వారికి గోరుచుట్టుపై రోక‌టి పోటులా ప‌రిణ‌మించాయి. ఆ వివ‌రాలేంటో చూద్దామా మ‌రి..

త‌మిళ‌నాడులోని రాణిపేట జిల్లా ప‌న‌పాక్కం ప‌ట్ట‌ణ స‌మీపంలో ప‌న్నియూర్ అనే గ్రామం ఉన్న‌ది. ఆ గ్రామంలో గ‌త కొన్ని రోజుల నుంచి కుప్ప‌లు తెప్ప‌లుగా కాకులు మృత్యువాత ప‌డుతున్నాయి. ముందుగా ఈ నెల ఒక‌టిన ఒకేచోట 10 కాకులు చ‌నిపోయాయి. తిండిలేక, ఎండ‌ల‌కు తాళ‌లేక అవి చ‌నిపోయి ఉంటాయ‌ని గ్రామ‌స్తులు భావించారు. అయితే, ఆ త‌ర్వాత కూడా వ‌రుస‌గా కాకుల మ‌ర‌ణాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. దీంతో ఇప్ప‌టికే క‌రోనా భ‌యంతో ఉన్న ప్ర‌జ‌లు.. క‌రోనాతోనే కాకులు చ‌నిపోతున్నాయేమోన‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ఈ విష‌యం స్థానిక ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి వెళ్ల‌డంతో కాకుల చావుల‌కు గ‌ల కార‌ణాలు తెలుసుకునే ప‌నిలో వారు ఉన్నారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo