శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 09, 2020 , 08:41:19

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమల: వేంకటేశ్వర స్వామి దర్శనానికి ఇవాళ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం ఉన్నది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం కల్పించారు ఆలయ అధికారులు. స్వామివారిని నిన్న 79,464 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,104 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.79 కోట్లు జమ అయినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 


logo