ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 04, 2020 , 17:23:37

వీరి మంచి మనుసుకు క్రౌడ్ ఫండింగ్ తోడైంది

వీరి మంచి మనుసుకు క్రౌడ్ ఫండింగ్ తోడైంది

ముంబై : మంచి మనుసుతో తోటివారికి సాయపడితే.. మనకూ ఏదో ఒక రూపంలో భగవంతుడు సాయం చేస్తారని పెద్దలు చెప్తుంటారు. ఇది అక్షరాలా నిజమని రుజువుచేస్తుంది ముంబైలోని ఓ సాధారణ ఉపాధ్యాయుడి జీవితంలో జరిగిన ఘటన. లాక్డౌన్ సమయంలో తమ పీఎఫ్ అకౌంట్లో దాచుకున్న డబ్బుతో పలువురికి నిత్యావసరాలు సమకూర్చిన వీరికి క్రౌడ్ ఫండింగ్ రూపంలో వారికి మరింత సేవ చేసే అవకాశం కలిగింది.

ముంబైలోని మల్వానీ ప్రాంతలో మురికివాడల చిన్నారుల కోసం ఫయాజ్ షేక్, మిగ్జా దంపతులు. ఇటీవల కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పనులు దొరక్క చాలా మంది పస్తులు ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. మల్వానీలో ఈ విషయాన్ని గుర్తించిన ఫయాజ్ షేక్ దంపతులు.. పీఎఫ్ అకౌంట్లో దాచుకున్న డబ్బును దాదాపు రూ.4 లక్షలు విత్ డ్రా చేసి 1500 మందికి నిత్యావసరాలు అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆనంద్ మహీంద్రా వారికి వారు ఖర్చు చేసిన మొత్తాన్ని బహుమతిగా అందజేసి అభినందించారు. అలాగే మరికొందరు కూడా డబ్బు రూపంలో సహాయం చేశారు. 

వీరి సేవానిరతికి సంబంధిచిన కథనం స్థానిక దినపత్రికల్లో రావడంతో.. ఎవరో ఒకరు గొప్పమనుసుతో క్రౌడ్ ఫండింగ్ వెబ్ సైట్లో వీరి గురించిన విశేషాలు పెట్టి ఆర్థికంగా ఆదుకోవాలంటూ 

సూచించాడు. దాంతో తక్కువ వ్యవధిలో దాదాపు రూ.30 లక్షలు పోగయ్యాయి. ఆ మొత్తాన్ని ఫయాజ్ షేక్ అకౌంట్లో వేసి మరింత సంఘసేవ చేయాలంటూ కోరారు. దీనిపై తానెంతో గర్వంగా ఫీలవుతున్నానని, తన స్కూళ్లో చదువుకునే మురికివాడల చిన్నారులకు దుస్తులు, మధ్యాహ్న భోజనం అందించేందుకు ఈ డబ్బును ఖర్చు చేస్తాను అని చెప్పారు. అలాగే స్కూళ్లో చిన్నారుల కోసం మంచి మూత్రశాల నిర్మిస్తానంటున్న ఫయాజ్ షేక్ దంపతులు మున్ముందు మరింత మందికి సేవలందిస్తారని ఆశిద్దాం.


logo